నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్ లోని వ్యభిచార గృహం పై శుక్రవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నిజామాబాద్ ఇంచార్జీ కమిషనర్ సింధూశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యలో దాడి చేసి నిర్వాహకురాలని, ఇద్దరు మహిళలను, ఇద్దరు విటులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నిచి రూ.670నగదు, 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ రూరల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.