బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో అక్రమంగా నిల్వ చేయబడిన పురుగుమందులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనిల్ టాకీస్ రోడ్డు మరియు అంబేద్కర్ చౌరస్తా పరిధిలో ఉన్న షాపులను పరిశీలించి, కాలం చెల్లిన మందులు గుట్టుగా నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడులను టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్‌ఐ భాస్కర్ చారి ఆధ్వర్యంలో నిర్వహించారు.