ఆఫిసర్స్ క్లబ్ లో పెకాట రాయుళ్ల అరెస్టు
. . . అనిసా నగర్ లో చైనా మాంజా స్వాధినం
బోదన్, నిజామాబాద్ :
నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సిందూశర్మ అదేశాల మేరకు టాస్క్ పోర్స్ ఎసిపీ నాగేంధ్ర చారీ అధ్వర్యంలో పోలిసులు బోదన్ లోమెరుపు దాడులు చేశారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ పోర్స్ సీఐ అంజయ్య సిబ్బంది అదివారం దాడి చేశారు. పెకాట అడుతున్న 22 మందిని ఆధీనంలోనికి తీసుకొని, రూ. 31,200 నగధు, 24 సెల్ పోన్ లను స్వాధీనం చేసుకొని బోధన్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించారు. బోధన్ పట్టణంలోని అనీషా నగర్ కాలనీలో కిరాణా షాపు యందు చైనా మాంజా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఏసీబీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య మరియు సిసిఎస్ సిబ్బంది దాడి చేయడం జరిగింది. ఈ సందర్బంగా 8 చైనా మాంజ బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. (వీటి విలువ సుమారు 8000/- వరకు గలదు). షాపు యాజమాని జునైద్ ఖాన్ ను అదుపులోకి తీసుకోని బోధన్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించారు.