విత్తనాల నాణ్యత పై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాలలో మంగళవారం టాస్క్ఫోర్స్ అధికారులు విత్తనాల నాణ్యత, కల్తీ విత్తనాల నివారణకై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, సీడ్స్ సర్టిఫికేషన్, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, విత్తన ప్యాకెట్లు లాట్ నంబర్స్, సర్టిఫికేషన్, వాలిడిటీ తేదీ తదితర వివరాలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలను చేపట్టగా, లాభా పేక్షతో కల్తీ విత్తనాలను విక్రయిస్తే...