Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2024, 5:46 pm Posted by : ramakrishna

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

  •  లక్ష పై చిలుకు నగదు స్వాధీనం
  •  నలుగురు పేకాట రాయుళ్ళ అరెస్టు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామం వద్ద పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ పురుషోత్తం, సిబ్బంది లక్ష్మణ్, రాజేశ్వర్, రాములు, అనిల్, నర్సయ్య, సుధాకర్, ఆజాంలు దాడులు నిర్వహించారు. మల్లారం గ్రామ ప్రవేశం వద్ద ఉన్న మేఘన డెంటల్ కళాశాల వద్ద పేకాట ఆడిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. పేకాట ఆఢుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,03,810 నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానికంగా ఉన్న బేకరి వెనుక పేకాట స్థావరాన్ని భగ్నం చేయడం గమనార్హం.