- బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
బతుకమ్మ,ఆర్మూర్: తాళ్లరాంపూర్ వీడీసీని రద్దు చేయాలని బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. తాళారాంపూర్ గ్రామంలో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర బీసీ కులాలలో ఇది ఒక మార్పు రావాలని వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో గంగపుత్ర ,ముదిరాజ్, యాదవ, రజక, మున్నూరు కాపు తదితర కులాలను బహిష్కరించిన గ్రామాలకు వెళ్లి వీడీసీలను రద్దు చేయాలని అనేక ధర్నాలో పాల్గొన్నమని తెలిపారు. ఇంతవరకు గీత కార్మికులకు న్యాయం చేయకపోవడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నామని , వెంటనే కుల బహిష్కరణను ఎత్తివేయాలని, వీడీసీలపైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గౌడ మహిళలను సాధారణంగా గుడిలోకి భాజా భజంత్రీలతో ని మేళా తాలతోని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగాగౌడ్ , బాల్కొండ ఎంపీపీ లింగాగౌడ్, రాంపూర్ రామా గౌడ్ ,కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట రాములు, కుయ్యాడి నరసింహులు గౌడ్ , శ్రీరామ్ గౌడ్ ,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూరీనిడ దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జారం అంబదాస్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్లొల సురేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పడగెల బాలరాజ్, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు,రాష్ట్ర గౌడ సంఘం నాయకులు, రాష్ట్ర గంగపుత్ర సంఘం నాయకులు, రాష్ట్ర రజక సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.