Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 8:43 pm Posted by : ramakrishna

బోధన్ డివిజన్ పోలీసుల ప్రతిభ

బోధన్, బతుకమ్మ : మూడవ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో 10 పథకాలు గెలిచిన బోధన్ డివిజన్ పోలీసులు తమ సత్తా చాటారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో బోధన్ డివిజన్ కు చెందిన 5గురు పోలీసులకు వివిధ స్థాయి పోటీలలో 2 బంగారు, 2 వెండి, 6 కాంస్య మొత్తం 10  పథకాలను గెలవడంతో, బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో గెలిచిన అభ్యర్థులకు పథకాలను, ధ్రువపత్రాలను ఎసిపి శ్రీనివాస్ అందజేశారు. రుద్రూర్ పిఎస్ నుండి స్విమ్మింగ్ లో ఎండి ఆఫ్సర్ 1 బంగారు, 2 వెండి, 1 కాంస్య పథకాలను, బోధన్ పట్టణ పిఎస్ నుండి సాయి కృష్ణ రన్నింగ్ లో 1 బంగారు పతకం, గంగా ప్రసాద్ ఏఎస్ఐ కు టేబుల్ టెన్నిస్ లో 1 కాంస్య పథకం, బోధన్ రూరల్ పిఎస్ నుండి నరేందర్ కి స్విమ్మింగ్, జూడో, వరుస్లింగ్ ఫ్రీస్ట్లీ 3 విభాగాల్లో 3 కాంస్య పథకాలు, కోటగిరి పిఎస్ నుండి అరుణ్ కుమార్ కి కరాటే లో 1 బంగారు పతకం, వివిధ విభాగాల్లో డివిజన్ పోలీసులకు మొత్తం 10 పథకాలు రావడం జరిగింది. వీరికి ఏసిపి శ్రీనివాస్ పథకాలను, ధ్రువపత్రాలను అందించారు. రానున్న రోజుల్లో మన డివిజన్ నుండి మన పోలీసులు క్రీడా పోటీలలో పాల్గొని మరిన్ని పథకాలు సాధించాలని ఏసీబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శ్రీనివాస్ తో పాటు పట్టణ సీఐ వెంకటనారాయణ ఉన్నారు.

Talents of Bodan Division Police