మండస్థాయిలో సుంకేట్ విద్యార్థుల ప్రతిభ
బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ మ్యాథమెటిక్స్ (టీ ఎం ఎఫ్)ఆధ్వర్యంలో శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో మండల స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీ లో సుంకేట్ హై స్కూల్ కు చెందిన పదవ తరగతి విద్యార్థిని బండి అనుశ్రీ మొదటి స్థానంలో, అంకం శ్రీహిత రెండవ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల విద్యాధికారి సమ్మిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య,వేణుగోపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.