Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 4:53 pm Posted by : ramakrishna

ఇంటర్ ఫలితాలలో ఎస్ఎస్ఆర్ విద్యార్ధుల ప్రతిభా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇంటర్మీడియట్ 2025-26 ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ప్రతిభ చాటారు. ఆదివారం వెలువడిన రిజల్ట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కుందేన్ అఖిల్ ఎంపీసీ లో 1000 /869 మార్కులు అనగా 87శాతం మార్కులు సాధించాడు. ఎంపీసీ విద్యార్ధిని వోడేపు విష్ణు ప్రియ 857/1000 అత్యధిక మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బైపిసి విద్యార్ధిని యం. సాహితీ 440/423 మార్కులు అనగా 96 శాతం, ఎంపీసీ విద్యార్ధిని షీజా కౌసర్ 470/422 మార్కులు సాధించింది. ఓకేషనల్ విభాగంలో ఎం ఎల్ టి మొదటి సంవత్సరం విద్యార్థి కాలూరు ప్రణిత్ కుమార్ 500/474, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ యంపిహెచ్డబ్ల్యూ (ఎఫ్) గోర్ కంటి మమత 443/500 మార్కులు సాధించింది. యం ఎల్ టి ద్వితీయ సంవత్సరంలో అబ్దుల్ నబీర్ 960/1000 రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డా. మారయ్య గౌడ్ అభినంధించారు. క్రమ శిక్షణతో ప్రణాళిక బద్ధంగా విద్య ద్వారా తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులను సాధించారని అన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను తమ విద్యాసంస్థ ప్రోత్సహిస్తుందని అన్నారు. నాన్ రెసిడెన్షియల్ కళాశాల జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తమకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల డైరెక్టర్ యం.హర్షిత్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

Talent of SSR students in Inter results