మండలస్థాయిలో నాళేశ్వర్ క్రీడాకారుల ప్రతిభ

నవీపేట్, బతుకమ్మ: మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీల్లో నాళేశ్వర్ ప్రభుత్వ పాఠశాల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబర్చి తొమ్మిది బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, ఉపాధ్యాయులను గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. 68వ ఎస్ జీఎఫ్ క్రీడలు బినోల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా నాళేశ్వర్ పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ సత్తాచాటారు. పీఈటీ సంతోష్, హెచ్ఎం శ్రీదీప్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు, మాజీ సర్పంచ్ ద్యాగ సరీన్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు...