ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలానికి చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ఇందల్వాయికి చెందిన విద్యార్థినులు పలు క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రమేష్ కుమార్ తెలిపారు.ఈనెల 7, 8, 9వ తేదీలలో సిరిసిల్ల జిల్లా టీజీ ఇ ఎం ఆర్ ఎస్ – ఎల్లారెడ్డిపేటలో నాలుగవ రాష్ట్రస్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించారన్నారు. అండర్-19, వాలీబాల్ విభాగంలో ఈ ఎం ఆర్ ఎస్ – ఇందల్వాయి విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచి నేషనల్ కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు.( సెలెక్ట్ అయిన వాళ్లు కెప్టెన్ జి. కృష్ణవేణి ,బి పూజ, ఆర్ అఖిల, పి సంగీత, ఆర్ వైష్ణవి,జే అశ్విత) లను ప్రిన్సిపాల్ అభినందించి హర్షం వ్యక్తం చేశారు.బాక్సింగ్ అండర్-19లో కె.గంగామణి ప్రథమ స్థానంలో నిలిచి నేషనల్ కు సెలెక్ట్ అయ్యారన్నారు.కే హారిక అండర్-19, బాక్సింగ్లో ప్రథమస్థానం,రెజ్లింగ్లోనూ ప్రథమ స్థానం,జూడోలో ద్వితీయ స్థానాన్ని సాధించారన్నారు.అండర్-19 షార్ట్ పుట్ లో జి.కృష్ణవేణి ద్వితీయ స్థానం, అథ్లెటిక్స్ లోనూ ద్వితీయ స్థానం సాధించిందని తెలిపారు.అండర్-14 లాంగ్ జంప్ లో శృతి ద్వితీయ స్థానం,షణ్ముఖప్రియ బాక్సింగ్లో ద్వితీయ స్థానం, రెజ్లింగ్ లో తృతీయ స్థానం, మీనాక్షి అథ్లెటిక్స్ లో తృతీయ స్థానం సాధించారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్ లో తృతీయ స్థానం, టేబుల్ టెన్నిస్ లో తృతీయ స్థానం, జూడోలో తృతీయ స్థానాన్ని విద్యార్థినులు సాధించారు. ఈ క్రీడల్లో EMRS – ఇందల్వాయి నుండి 50మంది బాలికలు వివిధ తరగతుల నుండి పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు,పాల్గొన్నారు.