మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ భాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్ కు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు.