గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోవాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్‌నగర్ గ్రామంలో మంగళవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 48 ఆవులు, గేదెలకు గాలికుంటు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతారాంరాజు, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.