Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 3:32 pm Posted by : ramakrishna

మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మెగా వైద్య శిబిరాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం “మెగా వైద్య శిబిరం” ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతథిగా హాజరై మాట్లాడారు.  మందులు వాడేకంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. సిబ్బంది ఎల్లప్పుడు విధులు నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని, వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని పేర్కొన్నారు. మనం తీసుకునే అన్నిరకాల ఆహర పదార్థలలో కల్తీ చాలా ఉందని, కొన్ని వ్యాదులకు గతంలో వైద్యం అందుబాటు లో ఉండేది కాదని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాదునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా ఆర్బిఎస్, కంటి పరీక్ష, ఇసిజి. 2డి ఈకో, క్యాన్సర్ స్క్రిన్నింగ్, బిపి, షుగర్, వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మనకు అందించే అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Take advantage of the mega medical camp

ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) రామ్ చందర్ రావు , నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, పి. శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ (అడ్మిన్ ), శేఖర్ బాబు ( ఎమ్.టి.ఓ). తిరుపతి (వెల్ఫేర్), సతీష్ (హోమ్ గార్డ్సు) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా॥ సరళ, డాక్టర్లు సుధాకర్ రావ్ (సీనియర్ కార్డియాక్ సర్జన్) చంద్ర మోహన్ (కార్డియాలాజిస్ట్), వంశీ (జనరల్ ఫిజీసియిన్), అఫ్రిన్ (గైనకొలేజిస్ట్), నిఖిత (అన్ కలజీస్ట్), షాహాభాజ్ హైమద్ (ఆర్థో పెడిక్),  జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పాల్గొన్నారు.

Take advantage of the mega medical camp