Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:58 pm Posted by : ramakrishna

సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

. . . ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.84 వేల విలువైన కంప్యూటర్ విరాళం

 

నిజాంసాగర్, బతుకమ్మ :

 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కూడా సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకాంక్షించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.84 వేల విలువైన నూతన కంప్యూటర్‌ను ఎన్నారై భుజంగారి భాస్కర్ రెడ్డి బుధవారం విరాళంగా అందించారు. ఈ కంప్యూటర్‌ను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించి ఉన్నత విద్యతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో భుజంగారి భాస్కర్ రెడ్డి ఈ కంప్యూటర్‌ను తన సొంత నిధులతో అందించారు.

 

Take advantage of technical education

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విద్యార్థుల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన భుజంగారి భాస్కర్ రెడ్డి సేవాభావాన్ని ఆయన అభినందించారు. డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థలకు సహకరిస్తున్న దాతలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు కంప్యూటర్‌ను విరాళంగా అందించిన భుజంగారి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కంప్యూటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Take advantage of technical education