Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 4:18 pm Posted by : ramakrishna

వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ కుమార్..

 

రుద్రూర్, బతుకమ్మ : రైడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ రుద్రూర్ ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరానికి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిభిరం జిల్లాలోనే ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.  విద్యార్థులు తమకు ఎంతో ఉపయోగపడే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి  కట్టా శ్రీనివాస్ రావు,

Take advantage of summer training camp

ప్రధానోపాధ్యాయులు దుర్కి సాయన్న, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతి శేఖర్, అసోసియేట్ అధ్యక్షులు మహాజన్ నర్సిములు, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజు, కోశాధికారి చిదుర మహిపాల్ గుప్తా, గౌరవ సలహాదారులు పత్తి రాము, కెవి మోహన్, బెజుగం వెంకటేశం గుప్తా, కార్యవర్గ సభ్యులు, 60 మంది విద్యార్థులు, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Take advantage of summer training camp