కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

  బిచ్కుంద, బతుకమ్మ :   ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులలో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన రూ.2400/క్వింటాల్ మద్దతు ధర ఉన్నందున, రైతులు అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న పంటను అమ్మాలని సూచించారు. అలాగే దళారుల మాటలను నమ్మవద్దని రైతులకు పేర్కొన్నారు.