Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 9:00 pm Posted by : ramakrishna

వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

. . . పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ప్రభుత్వం తరపున ఇస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో బాన్సువాడ పట్టణ డ్వాక్రా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 302 మహిళా సంఘాలకు రూ. 86 లక్షల 93 వేల వడ్డీలేని రుణ రాయితీ చెక్కును మహిళా సంఘాలకు అందించారు. అనంతరం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకు హైదరాబాద్ నుండి తన సొంత నిధులతో కొనుగోలు చేసి తెచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను పట్టణ డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించారు. అంతకు ముందు పట్టణంలోని 4వ వార్డులో పర్యటించి, వార్డు లో ఉన్న సమస్యలను తెలుసుకొన్నారు. రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని తెలిపారు. అనంతరం బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకొని దేవస్థానానికి సంబంధించిన రెండు ఎకరాల భూమిలో యువకులు క్రీడలు ఆడుకునేందుకు కేటాయించిన మైదానానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Take advantage of interest-free loans
Take advantage of interest-free loans