Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 12:10 pm Posted by : ramakrishna

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..

భిక్కనూరు, బతుకమ్మ:

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం  ఎమ్మెల్యే బిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  వేంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  పథకం కింద నగదు తో పాటు తులం బంగారం ఎప్పుడు అమలు చేస్తే అప్పుడు మీకు అదే విధంగా అందజేస్తానని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బిజెపి పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బండి రాములు రమేష్ రెడ్డి సతీష్ పవన్ నర్సింలు వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.