Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 5:27 pm Posted by : ramakrishna

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  • కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

 

బతుకమ్మ భిక్కనూరు: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే భిక్కనూరు మండలంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకాల 46 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 16 చెక్కులను పంపిణీ చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బండి రాములు యాదగిరి గౌడ్ నరేందర్ రెడ్డి బిజెపి కార్యకర్తలు ఉన్నారు.