ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రారంభోత్సవం ( లాంచింగ్) సందర్భంగా ఆదివారం మాచారెడ్డి మండలం రాజ్ ఖాన్ పేట్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ఈ రోజు ప్రారంభిస్తున్నదని...