Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 6:54 pm Posted by : ramakrishna

ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ను  ఫీనిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడు డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమన, సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్నిరకాల

Take advantage of free eye exams

జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని తెలిపారు.  ప్రతీ ఒక్కరు పౌష్టికమైన ఆహరం తీసుకోవాలని, 2020 రూల్స్ ప్రకారం అనునిత్యం కంప్యూటర్స్,  సెల్ ఫోన్స్ చూసేవారికి ప్రతీ 20 నిమిషాలకు 20 సెకండ్ల వరకు కంటికి విరామం ఇవ్వలని సూచించారు.  ప్రతీ ఒక్కరు 6 నెలలకు ఒక్కసారి కంటి పరీక్షలు తప్పనిసరిగ్గా చేయించుకోవాలని, దానివలన కంటి పరీక్షలు మెరుగుపడుతుందని అన్నారు. ఇలాంటి క్యాంప్ ల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనియమని కొనియాడారు. ఈ కార్యాక్రమంలో ప్రొబేషనర్ ఐ.పి.యస్. సాయికిరణ్ , అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచందర్ రావ్, బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, అడ్మిన్ (ఎ.సి.పి ) మస్తాన్ అలీ, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ), సతీష్ (వెల్ఫేర్) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా.సరళ, శంకర్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ కంటి వైద్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Take advantage of free eye exams