Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 10:30 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో తహశీల్దార్లు బదిలీ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో 15 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్ బిచ్కుంద నుంచి రాజంపేటకు, రేణుక చౌహన్ డోంగ్లి నుంచి లింగంపేటకు, హిమబిందు జుక్కల్​ నుంచి పాల్వంచకు, వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుందకు, మహేందర్ కుమార్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్​కు బదిలీ అయ్యారు. రాజా నరేందర్ గౌడ్ లింగంపేట్ నుంచి డోంగ్లికి, సతీష్ రెడ్డి గాంధారి నుంచి మాచారెడ్డికి, అనిల్ కుమార్ రాజంపేట నుంచి పిట్లంకు, సువర్ణ రామారెడ్డి నుంచి డీఏవో సబ్ కలెక్టర్ బాన్సువాడకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు.