Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 8:04 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్

రంగారెడ్డి, బతుకమ్మ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్, సర్వేయర్ ఏసీబీకి చిక్కిన ఘటన రంగారెడ్డి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద  తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.