ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్ వాయి మండల పరిధిలోని గంగారాం తండా గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్, తహసీల్దారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. తీర్మాన్ పల్లి శివారులో గల సర్వే నెంబర్ 744 లో 0.05 గుంటల భూమిని పరిశీలించారు. గ్రామపంచాయతీ ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు అద్దె ఇంటిలో గ్రామపంచాయతీని నడిపించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన భవనం నిర్మాణానికి స్థల పరిశీలన చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, సర్వేయర్, జిపిఓ, గ్రామ సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.