రుద్రూర్, బతుకమ్మ : మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామంలోని 4 వ వార్డు, 7వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, 16 వ వార్డులలో సోమవారం తహసిల్దార్ తారాబాయి, స్థానిక మండల నాయకులు పర్యటించారు. కురిసిన భారీ వర్షానికి ఆర్ఎన్ సి కాలనీ జలమయంగా మారింది. మురికి కాలువలు నిండిపోయి రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము తన సొంత ఖర్చులతో రెండు జెసిబిలను ఏర్పాటు చేయించి కాలనీలో నిల్వ ఉన్న వర్షపు నీటిని, మురికి కాల్వలను జెసిబి లతో శుభ్రం చేయించారు. అదేవిధంగా వర్షానికి ఇల్లు ఊరుస్తుండడంతో, శిధిలావస్థలో చేరిన ఇళ్లలో నివాసం ఉంటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులు 12 మందికి సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము గ్రామంలోని రజక సంఘంలో ఆశ్రయం కల్పించి వారికి భోజన సదుపాయాలు అందజేశారు.
