ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం తహసీల్దార్ బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా లేదా అని విద్యార్థిని, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆదేశించారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని ఆయన వెల్లడించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుభ్రత లేకుండా మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమని గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్ కుమార్, జి పి ఓ ప్రమోద్, గంగారం తదితరులు పాల్గొన్నారు.