ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య ప్రభుత్వ పాఠశాలను ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న సమస్యలను తెలుసుకున్నారు. గత వారం రోజులుగా నీటి సరఫరా లేదని పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని తహసిల్దార్ బాలయ్య వివరించారు. తక్షణమే విద్యార్థులకు నీటి కొరతను తీర్చడానికి సంబంధిత కాంట్రాక్టర్, ప్రిన్సిపాల్ తో మాట్లాడడం జరిగిందని ఆయన...