Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 5:06 pm Posted by : ramakrishna

ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య ప్రభుత్వ పాఠశాలను ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న సమస్యలను తెలుసుకున్నారు. గత వారం రోజులుగా నీటి సరఫరా లేదని పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని తహసిల్దార్ బాలయ్య వివరించారు. తక్షణమే విద్యార్థులకు నీటి కొరతను తీర్చడానికి సంబంధిత కాంట్రాక్టర్, ప్రిన్సిపాల్ తో మాట్లాడడం జరిగిందని ఆయన అన్నారు. రేపటిలోగా నూతన బోరు వేయడం జరుగుతుందని సంబంధిత కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్ తెలిపారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని తహసీల్దార్ బాలయ్య తో పాటు సర్పంచ్ సంగీత దిలీప్ కుమార్ పరిశీలించారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధూమ నాయక్, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్, మాక్లూర్ తాండ సదర్ నాయక్ దేవి సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

 

Tahsildar conducts surprise inspection of Ekalavya School.