బీఎల్‌వో వినోద్‌కు తహసీల్దార్ బాలయ్య సన్మానం

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా గ్రామానికి చెందిన బీఎల్‌వో వినోద్‌ను ఎస్‌ఐఆర్  ప్రక్రియలో విశేష ప్రతిభ కనబరిచినందుకు తహసీల్దార్ బాలయ్య ఘనంగా సన్మానించారు. మండలంలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మేఘ్య నాయక్ తండా గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ - 158 పరిధిలో మొత్తం 1,071 ఎస్‌ఐఆర్ ఫారాలు నమోదు చేయాల్సి ఉంది. వాటిలో 1,051 ఎన్యూమరేషన్ ఫారాలను విజయవంతంగా డిజిటలైజ్ చేసి ఎస్‌ఐఆర్ యాప్‌లో అప్‌లోడ్ చేసినట్లు తహసీల్దార్ బాలయ్య తెలిపారు....