Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 7:58 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా “తాహెర్”ఏకగ్రీవ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షునిగా క్లబ్ సీనియర్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి కిరణ్ కుమార్ గౌడ్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఎర్రం విగ్నేష్, బంటు వసంత్, ఉదయ కృష్ణ, దొన్పల్ సురేష్ తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి ఒక నామినేషన్ వేసిన నేపథ్యంలో నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున ఆమోదించినట్లు వారు తెలిపారు. కార్యదర్శి పదవికి నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం సక్రమంగా ఉన్నందున భూపాల్ రెడ్డి, నర్సారెడ్డి,స్వామిదాస్ పోటీలో ఉన్నారని అన్నారు. సంయుక్త కార్యదర్శి పదవికి నామినేషన్ పత్రాలు దాఖాలు చేసిన డాకం సాయిలు, జి సురేష్ గౌడ్  నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున వారు ఇద్దరు పోటీలో ఉన్నారని తెలిపారు. నామినేషన్ పత్రాల ఉపసంహరణ కు ఒక రోజు సమయం ఉన్నందున, నామినేషన్ లను ఎవరైనా ఉపసంహరణ చేసుకోని యెడల 29 తేదీన ఎన్నికలు క్లబ్ భవనంలోని సమావేశపు హాల్ లో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల తీరుతెన్నులను క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్య నారాయణ పర్యవేక్షించారు.