Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:14 pm Posted by : ramakrishna

తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్

 

 తాడ్వాయి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు ను సస్పెండ్ చేస్తు మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు ప్రజలకు అందుబాటులో ఉండక, అనాధికారికంగా విధులకు గైర్హాజరు అవుతుండటం, ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వంపై  ప్రజల నుంచి పిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఎస్పీ విచారణ నివేదిక ఆధారంగా మల్టీ జోన్ ఐజి తాడ్వాయి ఎస్సై పై వేటు వేశారు. ప్రస్తుతం కామారెడ్డి వి ఆర్ లో ఉన్న రాజయ్యకు తాడ్వాయి ఎస్ ఐ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tadvai SI Venkateshwarlu suspended