జాతీయ సదస్సుల కరపత్రాలు ఆవిష్కరించిన తె.వి.వి. ఉపకులపతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రూసా ఆర్థిక సౌజన్యంతో మార్చి లో జరుపబోయే ఒకరోజు జాతీయ సదస్సుల కరపత్రాలను సోమవారం తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి యాదగిరి రావు ఆవిష్కరించారు. జి.జి. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మార్చి 6న “తెలుగు మాండలిక సాహిత్య వికాసం; విస్తృతి, వైవిధ్యం” అనే అంశంపై, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో మార్చి 12 న “కృత్రిమ మేధతో ఆంగ్ల భాషా బోధనను మార్చడంలో అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తు మార్గాలు” అనే అంశంపై ఈ సదస్సు లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు....