Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 6:53 pm Posted by : ramakrishna

జాతీయ సదస్సుల కరపత్రాలు ఆవిష్కరించిన తె.వి.వి. ఉపకులపతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రూసా ఆర్థిక సౌజన్యంతో మార్చి లో జరుపబోయే ఒకరోజు జాతీయ సదస్సుల కరపత్రాలను సోమవారం తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి యాదగిరి రావు ఆవిష్కరించారు. జి.జి. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మార్చి 6న “తెలుగు మాండలిక సాహిత్య వికాసం; విస్తృతి, వైవిధ్యం” అనే అంశంపై, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో మార్చి 12 న “కృత్రిమ మేధతో ఆంగ్ల భాషా బోధనను మార్చడంలో అవకాశాలు, సవాళ్లు, భవిష్యత్తు మార్గాలు” అనే అంశంపై ఈ సదస్సు లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, ఆంగ్లం రెండు విభాగాలు సమకాలీనమైన అంశాలను, మాండలికాలతో వెలువడిన సాహిత్యాన్ని, ప్రక్రియలను అధ్యయనం చేయడం, ఆంగ్ల భాషా బోధనలో కృత్రిమ మేధ పరిణామాలు, అనేవి అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉందనీ అన్నారు. అనంతరం సదస్సు కన్వీనర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ యాదగిరి, కళాశాల ప్రిన్సిపల్ డా. పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, తెలుగు ఆచార్యులు లావణ్య, కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి, ఆంగ్ల విభాగం ఆచార్యులు కె.వి.రమణాచారి, సమత, సదస్సు కన్వీనర్లు లెఫ్టినెంట్ రామస్వామి, దండుస్వామి అధ్యాపకులు ఐ.గంగాధర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

The Vice Chancellor of T.V.V. launched the pamphlets of the national conferences of Telugu and English departments.