నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్ర పరిధిలోని కౌల్ పూర్ ప్రాథమిక పాఠశాలలో 49 మంది విద్యార్థులకు టీషర్టులు అందజేశారు. కౌల్ పూర్ వాసి ప్రేమ్ సాగర్ రూ. 15 వేల విలువైన టీషర్టులను విద్యార్థులకు అందించినట్లు హెచ్ఎం నరేశ్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఆంధ్రనగర్ గురుస్వామి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.