Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 12:05 pm Posted by : ramakrishna

ఒక దేశం ఒక చట్టం ఒక రాజ్యాంగం అని నినదించింది శ్యామా ప్రసాద్ ముఖర్జీ

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

జాతి ఐక్యత కోసం ఒక దేశం, ఒక చట్టం, ఒక రాజ్యాంగం అని నినదించింది శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని గుర్తు చేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతి ఐక్యత కోసం ఒక దేశం, ఒక చట్టం, ఒక రాజ్యాంగం అని నినదించిన మహనీయుడు అని కొనియాడారు. కేవలం రాజకీయ నేతను కాకుండా విద్యావేత్తగా, దార్శనికుడిగా జాతీయ సమగ్రత కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. స్వాతంత్రం తర్వాత కాశ్మీర్ కు ప్రత్యేక జెండా ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతో 1953లో “ఒక దేశంలో రెండు చట్టాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదని కాశ్మీర్ లోకి అడుగు పెట్టారన్నారు. అప్పుడే అనుమానాస్పదంగా మరణించి దేశం కోసం నిలిచారన్నారు. అప్పటి నుంచి జూన్ 23ను బలిదాన్ దివస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి యువత దేశం కోసం చదవాలని, దేశం కోసం బ్రతకాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బెల్లాల్ శశాంక్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, బొబ్బిలి సువర్ణ వేణు, కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, ప్రసన్న సత్యపాల్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఆనంద్ రావు, భూపతి, బాబీ సింగ్, సీనియర్ నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Syama Prasad Mukherjee raised the slogan: "One Nation, One Law, One Constitution