పుష్యమి నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమలలో స్వర్ణామృత ప్రాశన సేవలు

నర్సింగ్ పల్లి, బతుకమ్మ :   ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా చిన్నారులకు స్వర్ణామృత ప్రాశన ఔషధ ప్రసాద సేవలను ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఆలయానికి తరలివచ్చి ఈ దివ్య ఔషధ ప్రసాదాన్ని స్వీకరించారు. భారతీయ సంప్రదాయంలో ఆలయాలు కేవలం దైవ దర్శనాలకే పరిమితం కావని, అవి సాంస్కృతిక వికాసానికి కేంద్రబిందువులుగా, సమాజానికి జ్ఞానాన్ని అందించే విద్యా నిలయాలుగా ఉండేవని పెద్దలు చెబుతుంటారు. అదే భావజాలాన్ని ఆచరణలో చూపిస్తున్న వ్యక్తిగా ప్రముఖ నిర్మాతలైన...