- లొద్ది రామన్న గుడిని అన్ని హంగులలతో అభివృద్ధి చేస్తా
- పీ సీ సీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
భీమ్ గల్, బతుకమ్మ: తన స్వస్థలమైన పిప్రి లొద్ది రామన్న ఆలయంలో శ్రీ సీత రాముల కల్యాణ మహోత్సవం లో పాల్గొనడం తనకేంతో సంతృప్తి నిచ్చిందని పీ సీ సీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మండలంలోని పిప్రి గ్రామ కమిటీ, ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు శ్రీరామ నవమి ఉత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన స్వామి వారికి నూతన వస్త్రా లను సమర్పంచి, స్వామి కల్యాణ క్రతువులో, స్వామి యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ కట్టించిన లొద్ది రామన్న ఆలయంలో తాను స్వామి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన తండ్రి కట్టిన ఆలయంను గత కొన్నేళ్లుగా గ్రామస్థులు అభివృద్ధి చేసారని అన్నారు. ఇంకా ఈ ఆలయానికి డబుల్ రోడ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను

సీ. ఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లో చేయిస్తానని అన్నారు.స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ వారిచ్చిన వినతి పత్రం లో అడిగిన పనులన్నింటి చేయించి, లొద్ది రామన్న ఆలయాన్ని అన్ని హంగులలతో అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. తన వంతుంగా సొంత విరాళం రూ. 2 లక్షలు అందజేశారు. తన సొంత గ్రామమైన రహత్ నగర్ లో ఆలయ నిర్మాణం పనులకు రూ. 50 లక్షలు మంజూరు ఇప్పించినట్లు తెలిపారు. ఆయన వెంట స్టేట్ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవ త్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, బాల్కొండ కానిస్టేన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాటిపల్లి నగేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, పిప్రి గ్రామ కమిటీ, ఆలయ కమిటీ ల పాలకవర్గం, వివిధ గ్రామాల భక్తులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
