యువతను జాతి నిర్మాణానికి సిద్ధం చేయడమే స్వామి వివేకానంద జీవిత లక్ష్యం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యువతను జాతి నిర్మాణానికి సిద్ధం చేయడమే స్వామి వివేకానంద జీవిత లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నగరంలోని 28వ డివిజన్ గాజులపెట్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి, అలాగే 10వ డివిజన్ నాగారంలోని స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మహానీయుడిగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని...