నిజామాబాద్, బతుకమ్మ: భారతదేశం గొప్పతనాన్ని సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మానీయుడు స్వామి వివేకానంద అని ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ అన్నారు. ఇతర మత గ్రంథాలను పూర్తిగా సంక్లిష్టంగా చదివి ప్రతి ఒక్కరి పట్ల కుల మత వివక్షత లేకుండా భారతీయులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం స్వామి వివేకానంద మాత్రమేనని తెలిపారు. అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్ మాట్లాడారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన వంద మంది యువకులను నాకు అప్పజెప్పితే ఈ దేశం యొక్క రూపురేఖలు స్థితిగతులు మారుస్తా అని చెప్పినటువంటి మహనీయుడని తెలిపారు. ప్రతి ఒక్క యువత కూడా స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ వ్యవస్థ ప్రముఖ్ సురేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, శంకర్, ఇందూర్ జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్ కుమార్, ఇందూర్ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ దామ సునీల్, ఇందూర్ టౌన్ సెక్రటరీ వంజది బాలకృష్ణ, పూర్వ కార్యకర్తలు రాకేష్, నల్ల నవీన్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.