Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 4:19 pm Posted by : ramakrishna

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

. . . స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భముగా గాజులపేటలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు.

 

నిజామాబాద్ అర్బన్ బతుకమ్మ :

 

 

స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయులని, వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నరాల సుధాకర్ మాట్లాడారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత ఆధారపడి ఉంటుందని, భారతదేశ ఔనత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా చేసిన ఘనత వివేకానందునికే దక్కుతుందన్నారు.  వివేకానందుని సాహిత్యం అధ్యయనం చేసి అనుసరించిన విద్యార్థులు, యువతీ, యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు. ఈ రోజుల్లో యువత చాలా తొందరగా మనో వ్యాకులత (డిప్రెషన్) కు లోను అవుతున్నారని అన్నారు. నేటితరం విద్యార్థులు మరియు యువత చిన్న విషయాలకే కృంగిపోయి ఒత్తిడికి గురై హైరానా పడుతున్నారన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల చేత వివేకానంద సాహిత్యాన్ని చదివిస్తే వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం పెరిగి మనోవ్యాకులత తగ్గి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, తోట రాజశేఖర్, బగ్గలి అజయ్, రేఖ, బాలన్న, సదానంద్ సత్యనారాయణ, రాజేష్, శ్రీకాంత్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.