కల్దుర్కిలో స్వామి వివేకానంద, లోకమాత జీజబాయ్ జయంతి వేడుకలు
బోధన్ బతుకమ్మ : కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి, లోకమాత జీజబాయ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, భారతదేశ యువతకు మహా ప్రేరణగా నిలిచిన స్వామి వివేకానంద యువశక్తిని నమ్మిన గొప్ప నాయకుడని కొనియాడారు. నేటి యువతరానికి ఆదర్శమూర్తిగా నిలిచిన ఆయన భారతదేశ పేరు ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన మహనీయుడని తెలిపారు. కార్యక్రమంలో...