బోధన్ బతుకమ్మ :
కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి, లోకమాత జీజబాయ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, భారతదేశ యువతకు మహా ప్రేరణగా నిలిచిన స్వామి వివేకానంద యువశక్తిని నమ్మిన గొప్ప నాయకుడని కొనియాడారు. నేటి యువతరానికి ఆదర్శమూర్తిగా నిలిచిన ఆయన భారతదేశ పేరు ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన మహనీయుడని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బోరోల్ల జ్యోతి, సెక్రటరీ సునీత, VDC చైర్మన్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్, వార్డు సభ్యులు రామ్, మహేష్, అశోక్, చంద్రకాంత్, మోహన్, రమేష్, షేక్ హబీబ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బాబు, గౌర్గోండ, మొగులయ్య, శంకర్ రెడ్డి, జనని యూత్ సభ్యులు బాలు, మహేష్, శివ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
