బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో స్వచ్ఛతా హి సేవా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని నగర మేయర్ దండు నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి పారిశుద్ధ్య వాహనాలతో పులాంగ్ చౌరస్తా వరకు కొనసాగించారు. ర్యాలీలో మున్సిపల్ అధికారులు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామని అన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.