బాన్సువాడ, బతుకమ్మ: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి టీఎస్ సీ భార్గవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, ఖలీల్, న్యాయవాదులు కోర్టు పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశారు. న్యాయవాదులు భూషణ్ రెడ్డి, రమాకాంత్ రావు, రాంరెడ్డి, మొగులయ్య, సయ్యద్ హమీద్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.