డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగాపూర్ బీఈడీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) పనిచేస్తున్న సువర్చల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాందించింది. సువర్చల ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో (ఎన్ఐఆర్డి పీఆర్) అసోసియేట్ ప్రొఫెసర్ డా.టీ.విజయ్ కుమార్ పర్యవేక్షణ లో ఎడ్యుకేషన్ ఏమాంగ్ రూరల్ డిసవన్డ్టేజ్డ్ క్లాస్ గర్ల్స్ : ఏ స్టడీ స్కూల్ అడ్జస్ట్మెంట్ అండ్ అకడమిక్ పెర్ఫార్మెన్స్ అనే అంశం పై థీసిస్ ను సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎ. సువర్చల ని అభినందిస్తూ డాక్టరేట్ పూర్తి చేసినట్లు ఎక్స్టర్నల్ గా విచ్చేసిన ప్రొఫెసర్లు చైర్ పర్సన్ డా.జె లలిత (బిఓఎస్), హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ కె మూర్తి, డా. దుర్గేషణ్, డా. అనుపమ లు ప్రకటించారు.