బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 5004 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 5004 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 3600 క్యూసెక్కులు, లక్ష్మీకాల ద్వారా 100 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80 501 టిఎంసి ల నీరు నిల్వ ఉంది.