వివాహిత అనుమానాస్పద మృతి
భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానాలు ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ 7వ వార్డు పరిధిలో గల తిరుమల కాలనీలో శనివారం ఉదయం ఆకుల లావణ్య (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, ఆర్మూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆకుల ప్రవీణ్ 9 సంవత్సరాల కిందట జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన లావణ్యను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కాగా.. వారిలో కుమార్తెలు అక్షయ,...