భర్త మృతిపై అనుమానం..
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం రుద్రూర్, బతుకమ్మ : భర్త పై అనుమానంతో మృతదేహాన్ని పూడికతీత సంఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలంలోని ఆర్ఎన్సీ కాలనీకి చెందిన మేతరి సాయిలు (ట్రాక్టర్ డ్రైవర్) అను వ్యక్తి రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత పది రోజుల కిందట మృతి చెందాడు. మృతుడు సాయిలు మొదటి భార్య శోభ మరణించగా, కోటగిరి గ్రామానికి చెందిన రెండవ భార్య బొర్ర సాయవ్వతో వివాహం జరిగింది. వీరికి...