Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 10:21 pm Posted by : ramakrishna

ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెన్షన్

 

 

. . .  ఎస్ఐ కి ఛార్జ్ మెమో

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్  పరిధిలో ని  ఒక పిఎస్ లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళను సీపీ సాయి చైతన్య సస్పెండ్ చేసారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మహారాష్ట్ర లో నేరస్తులను పట్టుకొనేందుకు వెళ్లడం పై సీపీకి ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. శనివారం ఎస్బి అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. అధికారుల నివేదిక ఆధారంగా కానిస్టేబుల్ శంకర్,రాజేష్ లను సస్పెండ్ చేసారు. కానిస్టేబుళ్ళను రాష్ట్రం ధాటి పంపించిన స్థానిక ఎస్ఐ కి ఛార్జ్ మెమో జారీ చేసినట్టు తెలిసింది. సంబందిత ఎస్ఐ ప్రోహిబిషనరి లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.